కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి….

  • నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
  • ఆహార భద్రత అధికారి శరత్.
  • ద్రాచలంలోని హోటళ్లు, బిర్యానీ పాయింట్లపై ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 15
టుడే 9 ప్రతినిధి

భద్రాచలంలో అందిన ఫిర్యాదు మేరకు పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లలో ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఆహార భద్రత అధికారి శరత్ తెలిపారు. ఈ తనిఖీలలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, వంటశాలల నిర్వహణ, నిల్వ విధానాలు, లైసెన్సుల అంశాలను పరిశీలించినట్లు తెలిపారు .

తనిఖీల సందర్భంగా కొన్ని హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలు సరైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత యాజమాన్యాలకు ఒక వారం గడువులోగా లైసెన్సులు పొందాలని సూచించారు. అలాగే హోటల్ ప్రాంగణాలు, వంటశాలలు పరిశుభ్రంగా ఉంచుతూ ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.

పరిశుభ్రత లోపాలు గుర్తించిన హోటళ్లకు ఒక వారం గడువు ఇచ్చినట్లు, అనంతరం మళ్లీ తనిఖీలు నిర్వహించి పరిస్థితులను సమీక్షిస్తామని ఆహార భద్రత అధికారి శరత్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీలలో భాగంగా అధికారులు 3 యాక్ట్ నమూనాలు, 9 సర్వైలెన్స్ నమూనాలు సేకరించి ప్రయోగశాలకు విశ్లేషణ నిమిత్తం పంపించినట్లు తెలిపారు. నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని అన్నారు .

ప్రజలకు నాణ్యమైన, సురక్షిత ఆహారం అందించడమే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆహార భద్రత అధికారి శరత్ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు