కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ట్రైబల్ మ్యూజియం సందర్శించిన గిరి దర్శక్ బృందం…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 19
టుడే 9 ప్రతినిధి

భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో పొందుపరిచిన కళాఖండాలు చాలా అద్భుత ఉన్నాయని, గిరిజన అభివృద్ధి కొరకు పాటుపడడమే కాక వారి సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియం రూపకల్పన చేసిన ఐటీడీఏ బి రాహుల్ ను అభినందిస్తున్నట్లు గిరి దర్శక్ రోల్ టూరిస్ట్ గైడ్ ఉబ్బమోహన్రావు అన్నారు.
మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో పౌర రక్షక శాఖ ఆధ్వర్యంలో గిరిదర్శక్ శిక్షణ పొందుతున్న గిరిదర్శక్ బృందం టూరిస్ట్ గైడ్ సభ్యులు శిక్షణలో భాగంగా గిరిజన మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలోని ఆదివాసీలకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను మరియు కళాకృతులను గిరిజన క్రాఫ్ట్ తయారీ విధానాన్ని వారు పరిశీలించినారు. మారుమూల ఆదివాసి గిరిజనుల యొక్క పురాతన వస్తువులను సేకరించి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భావితరాలకు తెలిసే విధంగా మ్యూజియంలో పొందుపరచడం చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. ఆహార సేకరణకు ఉపయోగించే వస్తువులు నీళ్లకు ఉపయోగించే సొరకాయతో చేసినటువంటి సొరకాయ బుర్రలు బాగున్నాయని, ఆదివాసులు ఆధునిక పోకడలకు పోకుండా పర్యావరణాన్ని కాపాడే వస్తువులను నిత్యజీవితంలో ఉపయోగించుకోవాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి,మాధవి, స్రవంతి, సందీప్ కుమార్, ఉదయ్ కుమార్, రవి, ముత్యాలరావు, దేవా, వర్ష సందీప్, అపక సాంబ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు