ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్: ‘ఈసారి టైగ‌ర్ కాదు డ్రాగ‌న్’ అంటూ అల్లు అర్జున్ క్రేజీ విషెస్!

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తారక్ బర్త్‌డేను పురస్కరించుకుని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్రనటులు, దర్శకులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సీనియర్ నటి ఖుష్బూ చేసిన ఆసక్తికర పోస్టులు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో ఎన్టీఆర్‌కు చాలా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ అందించారు. “హ్యాపీ బర్త్‌డే బావా.. ఈసారి వచ్చేది టైగర్ కాదు.. డ్రాగన్. ప్రతి షాట్‌లోనూ నిప్పులు చెరిగావ్” అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బన్నీ పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’ గ్లింప్స్‌ను, అందులో తారక్ నటనను కొనియాడుతూ బన్నీ చేసిన ఈ క్రేజీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా వైరల్ అవుతోంది.

మరోవైపు సీనియర్ నటి ఖుష్బూ సైతం తారక్‌పై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ భావోద్వేగంగా స్పందించారు. “నా ప్రియమైన, నాకు అత్యంత ఇష్టమైన తారక్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం, విజయం, మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలి. లవ్ యూ కన్నా!! నా హీరో, నా తారక్, నా డ్రాగన్” అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ స్టార్ల ట్వీట్లతో ఎన్టీఆర్ అభిమానుల బర్త్‌డే సంబరాలు నెట్టింట మరింత అంబరాన్ని తాకాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు