కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఉద్యోగులు సమయపాలన పాటించాలి….

*ఉద్యోగులు సమయపాలన పాటించాలి.

*ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. మే 21
టుడే 9 ప్రతినిధి

ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, క్రమశిక్షణ, ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ, కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.తనిఖీల సందర్భంగా కలెక్టర్ ప్రతి కార్యాలయంలోని సీట్ల వద్దకు వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను పరిశీలించి సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు ఎందుకు విధులకు హాజరుకాలేదని అధికారులను ప్రశ్నించారు. సరైన కారణాలు తెలియజేయకుండా ఆలస్యంగా వస్తున్న సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, ఈరోజు జీవితంలో కోత విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 గంటలలోపు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. విధులకు హాజరైన ప్రతి ఉద్యోగి హాజరు రిజిస్టర్‌లో తప్పనిసరిగా సంతకం చేయాలని సూచించారు. నిర్ణీత సమయానికి కార్యాలయాలకు రాకపోవడం లేదా హాజరు రిజిస్టర్‌లో సంతకం చేయని వారిని గైర్హాజరుగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని అన్నారు . ప్రతి శాఖలో అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, క్రమశిక్షణ, పారదర్శకత పెంపొందించేందుకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు

ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు