కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ‘యల్లమ్మ’కు అందుకే ఓకే చెప్పా.. దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ వీడియో ఇదిగో!

ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) నటుడిగా అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘యల్లమ్మ’ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. అయితే, ఒక అగ్ర సంగీత దర్శకుడిగా ఉండి నటన వైపు ఎందుకు అడుగులు వేశారనే దానిపై డీఎస్పీ స్వయంగా స్పందించారు. తాను ఈ సినిమా చేయడానికి అంగీకరించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని మంగళవారం వెల్లడించారు.

ఈ మేరకు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంటూ.. తన తండ్రి స్వగ్రామమైన వేదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “చిన్నప్పటి నుంచి జానపద కళల పట్ల నాలో ఆసక్తిని నింపిన అద్భుతమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇదే. మా ఊరిలో జరిగే ‘అమ్మోరు జాతర’ వేడుకలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. ‘యల్లమ్మ’ సినిమాకు నేను ఎందుకు ఓకే చెప్పానో ఇదే కారణం” అని డీఎస్పీ పోస్ట్‌లో పేర్కొన్నారు. చిన్నప్పుడు తన తండ్రి తమను చెన్నై నుంచి తరచూ ఈ గ్రామానికి తీసుకొచ్చేవారని, ఇక్కడి ప్రకృతి స్వచ్ఛతను, జానపద కళలను, దైవత్వాన్ని ఈ ఊరే తనకు నేర్పిందని వీడియోలో వివరించారు. ఈ బలమైన అనుబంధం కారణంగానే ‘యల్లమ్మ’ కథకు వెంటనే కనెక్ట్ అయినట్లు తెలిపారు.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథా చర్చల కోసం దర్శకుడు వేణు, డీఎస్పీ మధ్య జరిగిన తొలి సమావేశం ఏకంగా 8 గంటల పాటు సాగడం విశేషం. ఈ చిత్రంలో డీఎస్పీ ‘పర్శి’ అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించనుండగా, నటనతో పాటు ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు. సంస్కృతి, జానపద మూలాల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు