కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  అంబులెన్స్ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలి: న్యూ డెమోక్రసీ.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
చర్ల మే 29
టుడే 9 ప్రతినిధి

చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలుగా అంబులెన్స్ లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస సౌకర్యాలు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.న్యూ డెమోక్రసీ నాయకులు సతీష్ అన్నారు.

చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అంబులెన్స్ సిబ్బంది సమస్యలపై సర్వే చేసి వారి కష్టాలను తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో కామ్రేడ్ సతీష్ మాట్లాడుతూ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి చర్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏజెన్సీ గ్రామాలు ఆ గ్రామాలలో అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం హాస్పిటల్కు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నటువంటి అంబులెన్స్ సిబ్బంది రక్షణ విషయంలో కనీస సౌకర్యాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతోమందికి సేవలు చేసే వీరు వీళ్ళు సేద తీరడానికి కనీస సౌకర్యాలు లేవని ఆయన అన్నారు. కనీసం మహిళా సిబ్బందికి టాయిలెట్స్, ప్రత్యేకమైన రూము గాని, కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన హాలు కూడా లేనటువంటి పరిస్థితి ఈ అంబులెన్స్ సిబ్బంది ఉందని వారు అన్నారు. వారి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఎంతోమందిని కాపాడి ప్రాణం పోసిన అంబులెన్స్ సిబ్బందికి అనేక సమస్యలతో అనారోగ్యాన్ని ఈ ప్రభుత్వాలు సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు.ఎనిమిది గంటల పని విధానం అమలు చేయించాల్సిన ప్రభుత్వాలు 24 గంటలు పని చేపించుకుంటూ 16 శాతం ఉన్న ఇంక్రిమెంట్లని 10 శాతానికి తగ్గించిందని పిఎఫ్ ఎస్ఐ బెనిఫిట్స్ లాంటిది తక్కువ చేస్తున్నారని వారు అన్నారు యాక్సిడెంట్ కోవిడ్ లా అండ్ ఆర్డర్ లాంటివి సమస్యలను రిస్క్ చేసుకుంటూ వారి డ్యూటీ చేస్తున్నారని వారు అన్నారు రాష్ట్రంలో ఇప్పటికే అంబులెన్స్ సిబ్బంది 77.17 లక్షల మందిని కాపాడారని వారన్నారు. ఇప్పుడు వచ్చేది కూడా వర్షాకాలం అని కొండలు గుట్టలు వాగులు దాటి పోవాలని నిద్రలేని రాత్రులు గడపవలసిన పరిస్థితి ఉంటుందని ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవో ప్రభుత్వ ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని అంబులెన్స్ సిబ్బంది కోసం ప్రత్యేకమైన రూముని కనీస సౌకర్యాలు నెలకొల్పాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కోరుతున్నాం

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు