​భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుంటా శ్రీనివాస్ కు ఆత్మీయ వీడ్కోలు

​భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుంటా శ్రీనివాస్ కు ఆత్మీయ వీడ్కోలు

భద్రాచలం, మే 31: TODAY 9:

భద్రాచలం కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గత రెండు సంవత్సరాలకు పైగా ఎంతో సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలందించిన కుంటా శ్రీనివాస్  సాధారణ బదిలీలో భాగంగా జగిత్యాల కోర్టుకు వెళ్తున్న సందర్భంగా, భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు  సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
​ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి మాట్లాడుతూ, శ్రీనివాస్  భద్రాచలంలో తను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సేవలందించిన సమయంలో అసాధారణమైన పనితీరును ప్రదర్శించారని, క్లిష్టమైన కేసుల్లో కూడా ఎంతో పారదర్శకతతో వ్యవహరించి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు. ఆయన వృత్తిపరమైన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి, అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
​అనంతరం ఇతర సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఎపిపి శ్రీనివాస్ కు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించి ప్రజలకు, న్యాయ వ్యవస్థకు మరింత విశిష్టమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి , పూలమాలలతో న్యాయవాదులందరూ కలిసి ఘనంగా సత్కరించారు.
​ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీ తాతా లలిత, లేడీ రిప్రెసెంటేటివ్ ఎం. తరుణి, సీనియర్ న్యాయవాదులు కే. శ్రీమన్నారాయణ, గొడపర్తి నాగరాజు, సి.హెచ్.ఎన్. అంబేద్కర్, పామరాజు తిరుమలరావు, దాట్ల సంధ్య, సౌజన్య తదితర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు