స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జవాన్ ను సన్మానించిన అశ్వాపురం మండల BRS పార్టీ నాయకులు
Today9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి అదే విధంగా మన దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ బెల్లి సంపత్ ను ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. దేశ రక్షణ కోసం జవాన్ లు చూపుతున్న త్యాగాలను శ్లాఘిస్తూ సైనికునికి అభినందనలు తెలియజేశారు ,
అనంతరం గొల్లగూడెం గ్రామానికి చెందిన దోసపాటి వెంకటేష్ (చింటూ) ఆర్యవైశ్య మహాసభల పబ్లిక్ రిలేషన్ కమిటీ వైస్- చైర్మన్ గా నియమించిన సందర్భంగా అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు..









