భద్రాచలం మే 31
టుడే 9ప్రతినిధి
తేదీ 01 జూన్ 26 సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన తెలుపుతూ సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.









