ఏపీలో నీతిమంతమైన పాలన నడుస్తోంది: బండి సంజయ్
పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో నీతివంతమైన పాలన నడుస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పక్కనే ఉన్న ఏపీలో మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నీతిమంతమైన పాలనతో, కేంద్ర నిధులను వాడుకుంటూ దూసుకెళ్తోందని కొనియాడారు. తెలంగాణలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిమయంగా మారాయని ఆయన విమర్శించారు.









