ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రవీనా ఠాండన్.. ఇప్పుడు కంటెంట్ డ్రివెన్ రోల్స్‌తో తన సత్తా చాటుతున్నారు. 2024లో విడుదలైన ‘పట్నా శుక్లా’లో సాధారణ గృహిణిగా, న్యాయం కోసం పోరాడే లాయర్‌గా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అదే ఏడాది ‘కర్మ కాలింగ్’ థ్రిల్లర్ సిరీస్‌లో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించడంతో పాటు ‘గుడ్‌చడి’ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం రవీనా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా, అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ కామెడీ చిత్రం ‘వెల్‌కమ్ టు ది జంగిల్’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలోనూ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. వీటితో పాటు ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ‘లాయర్’ అనే విభిన్నమైన ప్రాజెక్ట్‌లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు.
కమర్షియల్ సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తూ రవీనా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2006లో వచ్చిన కామెడీ చిత్రం ‘మాలామాల్ వీక్లీ’ సీక్వెల్‌లోనూ ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, తన కుమార్తె రాషా థడానీ కంటే వేగంగా సినిమాలు చేస్తూ రవీనా ఠాండన్ మరోసారి ఇండస్ట్రీలో తన జోరును చూపిస్తున్నారు.









