గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన మంత్రి మండిపల్లి

గాలివీడు మండలం పక్కిరెడ్డిగారిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుమ్మిరెడ్డి నారాయణరెడ్డి ప్రమాదవశాత్తు గాయపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా నిలవడమే టీడీపీ కుటుంబం ప్రత్యేకత అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు