శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  ఇద్దరు గంజాయి దొంగలు అరెస్టు..

 

భద్రాచలం జూన్ 3
టుడే 9ప్రతినిధి

భద్రాచలం డి యస్ పి ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ యస్ ఐ పి.శ్యాం ప్రసాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా భద్రాచలం గోదావరి కరకట్ట, రెడ్డి సత్రం సమీప ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించుచుండగా, ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు: వాడపర్తి సురేష్ షేక్ షఫీర్ పాషా @ సప్పు అని తెలిపినారు. ఇరు ఇద్దరు కూడా భద్రాచలంకు చెందినవారే. వీరు ఇద్దరు గత కొంత కాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయిని కొని భద్రాచలంలో భద్రాచలం చుట్టూ ప్రక్కల వారికీ గంజాయిని చిన్న చిన్న ప్యాకేట్లుగా చేసి లాభం పొందుతూ ఉండేవారు. వారిద్దరి వద్ద నుండి స్వాదినం చేసుకున్న సుమారు ఒక కేజీ బరువు గల గంజాయి 45,000/- రూపాయల విలువ కలదు. వారిద్దరి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ ను 2 మొబైల్ ఫోన్ లను స్వాదీన పరుచుకుని సీజ్ చేసి, పట్టుబడిన ఇద్దరు మగ వ్యక్తులను అదుపులోకి తీసుకొనగా, భద్రాచలం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ బి.రామకృష్ణ కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపడం జరిగింది. ఈ మద్య కాలంలో భద్రాచలం ప్రాంతానికి చెందిన వారె ఎక్కువగా గంజాయిని త్రాగడం కాని, గంజాయి రవాణా చేయడం కాని జరుగుతుందని కావున తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని హెచ్చరించారు. ఈ సందర్బంగా భద్రాచలం డి యస్ పి ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారిపై గంజాయి త్రాగేవాల్లపై గంజాయి అక్రమ రవాణాకు సహాయం చేసిన వారిపై చట్టపరమయిన చర్యలు తీసుకుంటామని గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ గురించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించగలరని, సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని భద్రాచలం డి యస్ పి తెలిపినారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు