భద్రాచలం హీల్ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: జెండా ఆవిష్కరించిన చైర్మన్ పోదెం వీరయ్య

భద్రాచలం,,

D వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి..

స్థానిక శాంతినగర్‌లోని హీల్ పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ పోదెం వీరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి మృదుల జయన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్త శ్రీ తాళ్లూరి పంచాక్షరయ్య, హీల్ కమిటీ సభ్యులు, రిటైర్డ్ ఏవో శ్రీ జగన్మోహన్ రావు, డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీ తిప్పన సిద్దులు, రిటైర్డ్ ఎఫ్.ఆర్.ఓ. శ్రీ రాజేశ్వరరావు, శ్రీ అడబాల వెంకటేశ్వరరావు, మరియు శ్రీ కేవీ గారు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, హీల్ సంస్థ అందిస్తున్న ఉచిత సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చైర్మన్ పోదెం వీరయ్య మాట్లాడుతూ.. ఉచిత విద్యను అందిస్తున్న ఇలాంటి పాఠశాలలో ప్రవేశం పొందడం విద్యార్థుల అదృష్టమని, దీనిని అవకాశంగా తీసుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.

అనంతరం శ్రీ తిప్పన సిద్దులు మాట్లాడుతూ.. కని పెంచిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, వారికి నిరంతరం పాదాభివందనం చేయాలని విద్యార్థులకు హితవు పలికారు. శ్రీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. 2009 నుంచి దాదాపు దశాబ్దన్నర కాలంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచిత విద్య, యూనిఫాం, బెల్టు, ఐడీ కార్డులను అందిస్తూ ఎందరో పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం ఎంతో హర్షణీయమన్నారు. ఇతర వక్తలు కూడా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సందేశమిచ్చారు.

ముగింపుగా ప్రిన్సిపాల్ మృదుల మాట్లాడుతూ.. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంస్థ అందిస్తున్న ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు