కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  పంచాయతీ అధికారులు పాలకమండలి సమన్వయంతో పనిచేయాలి…

*పంచాయతీ అధికారులు పాలకమండలి సమన్వయంతో పనిచేయాలి.

*వర్షాకాలం వస్తున్నందున ముందస్తు ప్రణాళికతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి.

*గ్రామపంచాయతీ కార్మికులకు క్రమం తప్పకుండా ప్రతినెల వేతనాలు చెల్లించాలి.

*గ్రామసభలో స్థానిక సమస్యలపై గలమెత్తిన సిపిఎం.

*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి.

భద్రాచలం జూన్ 8
టుడే 9 ప్రతినిధి

99 రోజుల పాలనలో భాగంగా భద్రాచలం గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో పాల్గొని భద్రాచల పట్టణంలోని వివిధ కాలనీల సమస్యలపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ భద్రాచలo పట్టణంలోని అనేక కాలనీలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని డ్రైనేజీల క్లీనింగ్ అస్తవ్యస్తంగా ఉన్నదని రోజు రావలసినటువంటి చెత్త ఆటోలు రెగ్యులర్గా రావడం లేదని అనేక మందికి మీటర్లు లేక కరెంటు పోల్ల సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామాలయం ఎదురుగా ఉన్నటువంటి డ్రైనేజీ ను తక్షణమే పూర్తి చేయాలని,ఏ ఎంసి కాలనీలో మధ్యంతరంగా ఆగిపోయిన డ్రైనేజీని పూర్తి చేయాలని రాజుపేట కాలనీలో నిర్మించిన డ్రైనేజీ మధ్యలో ఆగిపోయినదని దానిని వెంటనే పూర్తి చేయాలని భగీరథ మంచినీటి పథకం ద్వారా అందించే నీళ్లను కనీసం రెండు గంటలైనా ఇవ్వాలని కరకట్ట నిర్మాణానికి వరద ముంపు రాకుండా అధికారులతో మాట్లాడి ముందస్తు ప్రణాళికతోవెంటనే ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని మొక్కలు నాటేటప్పుడు కరెంటు తీగలు కింద కాకుండా జాగ్రత్తలు తీసుకుని మొక్కలు నాటాలని విష జ్వరాలు ప్రబలకుండా పోజింగ్,గ్ దోమల మందు జాగ్రత్తలు చేపట్టాలని కేవలం రోడ్లు నిర్మించడమే కాకుండా అన్ని కాలనీలో డ్రైనేజీలు ఒక పద్ధతి ప్రకారం నిర్మించాలని తదితర డిమాండ్లను అధికారులు దృష్టికి తీసుకురావడం జరిగినది స్థానిక గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని తదితర డిమాండ్లను గ్రామసభ ముందు ఉంచారుభవిష్యత్తులో వీటన్నిటిని పంచాయతీ అధికారులు పాలకమండలి సమన్వయంతో అమలు చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కమిటీ సభ్యులు, నగరికంటి నాగరాజు, కనక శ్రీ, అజయ్ కుమార్ ,భూపేందర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు