శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్. సమీక్ష..

  • ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్. సమీక్ష
  • నిరుద్యోగులను గుర్తించాలి ఎంపీడీవోలకు చూచన.
  • ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్.

భద్రాచలం జూన్ 8
టుడే 9 ప్రతినిధి

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశాల మేరకు గిరిజన యువతి యువకులకు సెక్టార్ స్కిల్ కౌన్సిలింగ్ ద్వారా 25 రకాల కోర్సులలో వృత్తి నైపుణ్యాలలో శిక్షణ అందించి వారికి వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి సంబంధిత ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీ ఇతర సిబ్బందితో వారి పరిధిలో ఉన్న గ్రామాలలో నిరుద్యోగులను గుర్తించి జూన్12 వరకు సంబంధిత నిరుద్యోగ గిరిజన యువతి యువకుల వివరాలు పంపించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ సంబంధిత ఎంపీడీవోలకు సూచించారు.
సోమవారం నాడు తన చాంబర్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం జిల్లాలోని ఎంపీడీవోలతో ఆయన మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులకు ఆరు సెక్టార్లలో 2,500 మందికి 25 రకాల కోర్సులలో 90 రోజులపాటు శిక్షణ అందించి, వారు నేర్చుకున్న కోర్సును బట్టి, ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అలాగే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా ముద్ర లోన్స్ ఇప్పించి వారికి జీవనోపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కోర్సులు భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు, ఖమ్మం మండలాలలో అందిస్తున్నామని, సంబంధిత ఎంపీడీవోలు మీ పంచాయతీ సెక్రెటరీ పరిధిలోని గ్రామాలలో ప్రతి పంచాయతీ సెక్రెటరీ పదిమంది చొప్పున నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించి, జూన్ 12 వరకు జాబితా పంపించేలా చర్యలు తీసుకోవాలని, జూన్ 15 నుండి, శిక్షణలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. సంబంధిత సెక్రటరీలు నిరుద్యోగుల వివరాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా వారి పేరు, మొబైల్ నెంబరు, వారు ఎంచుకున్న కోర్సును తప్పనిసరిగా జాబితాలో పొందుపరచాలని అన్నారు. సంబంధిత ఎంపీడీవోలు మీ మండలంలోని గ్రామపంచాయతీలలో సర్పంచులు ఇతర యూత్ సభ్యులను సంప్రదించి గ్రామాలలో దండోరా వేయించి, గిరిజన యువతి యువకులను తప్పనిసరిగా శిక్షణలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక బాధ్యత తీసుకొని యువతీ యువకులను గుర్తించాలని, ఏమైనా సందేహాలు మరియు ఇతర వివరాలకు ఖమ్మంలోని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఐటీడీఏ కార్యాలయంలోని జేడీఎంను ఫోన్ ద్వారా సంప్రదించి తెలుసుకోవాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు