భారతీరాజా పార్థివ దేహాన్ని చూసి.. CM విజయ్ భావోద్వేగం
ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా(84) కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి తమిళనాడు సీఎం విజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీరాజా భౌతికకాయంపై తలవాల్చి విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో భారతీరాజాకు దశాబ్దాల కాలంగా ఎంతో సన్నిహిత స్నేహబంధం ఉంది. సుమారు 30 ఏళ్ల క్రితం విజయ్‌తో ఒక సినిమా చేయాల్సిందిగా ఆయన తండ్రి కోరగా, భారతీరాజా అప్పట్లో సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ వారి కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయత, స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగింది









