కేదార్ యాదవ్ మొదట ఒక చెట్టు ఎక్కి లాలూ బర్త్‌డే కేక్ కట్ చేయాలని చూశారు. కానీ అక్కడ జనం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో, రూట్ మార్చి ఒక జేసీబీ (JCB) వాహనాన్ని రంగంలోకి దించారు. అక్కడ భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా, గాల్లో కేక్ కట్ చేసి హైలైట్ అవ్వాలని ఆయన జేసీబీ పైకి ఎక్కారు.
అయితే, వర్షం వల్ల జేసీబీ ఉపరితలం మొత్తం తడిగా ఉండటంతో కేదార్ యాదవ్ ఒక్కసారిగా కాలు జారి, కింద ఉన్న బురదలో బొక్కబోర్లా పడ్డారు. ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కానప్పటికీ, ఈ దృశ్యం చూసి అక్కడి వారంతా నవ్వుకున్నారు. ఆయన అనుచరులు వెంటనే స్పందించి ఆయన్ను పైకి లేపారు.
కిందపడ్డా ఆపని ‘లాలూ భజన’
బురదలో పడినా కూడా కేదార్ యాదవ్ అస్సలు తగ్గలేదు. లాలూ యాదవ్ దీర్ఘాయుష్షును కోరుకుంటూ కేక్ కటింగ్ వేడుకను పూర్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను భారతదేశపు “నెల్సన్ మండేలా” అని, ఆయన పేదల పాలిటి దేవుడని ప్రశంసించారు.
గతంలోనూ ఈయన ఎద్దులు, దున్నపోతులను ఎక్కి ప్రదర్శనలు చేయడం, రిక్షాలపై వింతగా ప్రయాణించడం లాంటి పనులతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈ జేసీబీ కేక్ కటింగ్ ఫెయిల్యూర్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.









