చిన్నారి మిస్సింగ్ కేసులో.. రంగంలోకి NDRF
ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం NDRF బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్డీఆర్‌ఎఫ్, అటవీశాఖ సిబ్బందితో కలిసి అధునాతన డ్రోన్ల సాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
ఈ ఘటనపై నిన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాజాగా హోంమంత్రి అనిత.. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి గాలింపు చర్యలను సమీక్షించారు. అలాగే కేసులో కీలకంగా ఉండి మృతిచెందిన పెంపుడు కుక్కకు ఇవాళ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.









