భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం న్యాయమూర్తి శివనాయక్ జన్మదిన వేడుకలు
భద్రాచలం, జూన్ 16:
భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ జన్మదిన వేడుకలు మంగళవారం భద్రాచలం కోర్టు ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనంతో ఘనంగా జరిగాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం కోర్టు ఆవరణలో కేక్ కటింగ్ నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో భద్రాచలం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దుర్గాభవాని, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసా చారి, జాయింట్ సెక్రెటరీ తాతా లలిత, కోశాధికారి దన్నాన రాము,లేడీ రిప్రజెంటేటివ్ ఎం తరుణి, సీనియర్ న్యాయవాదులు ఎంవి రమణారావు, గోడపర్తి నాగరాజు, రావి రామ్మోహన్, ఆర్. జయరాజ్ , పీ మస్తాన్ బాబు, అరుణ్ చంద్, అరుణ శ్రీ, తిరుమల రావు, అవునూరు సత్యనారాయణ, ఎంవి రమణ, ఎస్ మల్లేష్, నర్మదా, ఎస్ సతీష్, పి రవి వర్మ, గౌతమ్, వలవల సురేష్, వి రవితేజ, గాయత్రి, కారం రమేష్ బి తదితర న్యాయవాదుల ప్రతినిధులు, తోటి న్యాయవాదులు కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై న్యాయమూర్తికి ఆత్మీయ జన్మదిన అభినందనలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.









