రైలు టాయిలెట్‌లో టికెట్ లేని ప్రయాణికులు: వైరల్ వీడియోపై రైల్వే శాఖ రియాక్షన్

రైళ్లలో రిజర్వేషన్ కోచ్‌లలో సైతం టికెట్ లేని ప్రయాణికులు అక్రమంగా చొరబడటం, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంపై సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతుంటాయి. తాజాగా బిహార్ వెళ్తున్న ఒక రైలులో జరిగిన ఘోరమైన సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రిజర్వేషన్ కోచ్‌లోని టాయిలెట్ లోపల, బయట కూడా టికెట్ లేని ప్రయాణికులు కిక్కిరిసిపోయి కూర్చోవడంతో, అసలైన ప్యాసింజర్లు కనీసం టాయిలెట్ ఉపయోగించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఖాళీ చేయమని అడిగినా వారు స్పందించకపోవడంతో, బాధితుడు ఈ దృశ్యాలను వీడియో తీసి రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు పెట్టి రిజర్వేషన్ చేయించుకున్నా ఇలాంటి ఇబ్బందులు పడాలా అంటూ రైల్వే ప్రయాణాల భద్రత, నిర్వహణపై ప్రశ్నలు కురిపించారు. తోటి ప్రయాణికులు కూడా గతంలో తాము ఎదుర్కొన్న ఇలాంటి చేదు అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకోవడంతో ఈ వ్యవహారం కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ (Railway Seva) తక్షణమే స్పందించింది. బాధితుడి అధికారిక పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. సదరు ప్రయాణికుడి నుంచి రైలు నెంబర్, పిఎన్ఆర్ (PNR) నెంబర్, మరియు మొబైల్ నెంబర్ వంటి వివరాలను సేకరించింది. ఈ ఫిర్యాదును వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులకు బదిలీ చేశామని, నిబంధనలు ఉల్లంఘించి రిజర్వేషన్ కోచ్‌లను ఆక్రమించిన టికెట్ లేని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు