బైక్ పై ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం జూన్ 17
టుడే 9 ప్రతినిధి

ఈరోజు ఉదయం సమయంలో డీస్పీ భద్రాచలం ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ యస్ ఐ పి.శ్యాం ప్రసాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా భద్రాచలం కూనవరం రోడ్డులోని శ్రీ సుప్రియ (హెచ్ పి ) పెట్రోల్ బంక్ సమీప ప్రాంతంలో వాహనాల తనిఖీ నిర్వహించుచుండగా, అనుమానాస్పదంగా వచ్చిన పల్సర్ మోటార్ సైకిల్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి లగేజ్ బ్యాగ్‌తో దిగిన వెంటనే మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి వద్ద ఉన్న లగేజ్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో నాలుగు ప్యాకెట్లలో మొత్తం 8.580 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితుడు పర్సిక నాగేశ్వరరావు (45), సుందరయ్య నగర్ కాలనీ, భద్రాచలం గా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.4.29 లక్షలు ఉంటుందని అంచనా. ఈ గంజాయిని ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొనుగోలుదారు పరారీలో ఉండగా, వారి అరెస్టు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భద్రాచలం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ వి . సతీష్ కేసు నమోదు చేయగా దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్, భద్రాచలం ఇంచార్జ్ అయిన వెంకటప్పయ్య రిమాండ్ నిమిత్తం జైలుకు పంపడం జరిగింది. ఈ సందర్బంగా భద్రాచలం డీస్పీ భద్రాచలం ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. గంజాయి విక్రయదారులు, మధ్యవర్తులు, రవాణాదారులు. వినియోగదారులపై నిరంతర నిఘా కొనసాగుతోందని, వారి వివరాలు ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్నాయని, అతి త్వరలో ప్రత్యేక దాడులు నిర్వహించి వారందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వ్యాపారానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, యువత భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ గురించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించగలరని, సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని భద్రాచలం డి యస్ పి తెలిపినారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు