భద్రాచలం జూన్ 18
టుడే 9 ప్రతినిధి
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుబంధ మెంటర్ షిప్ కార్యక్రమానికి అనుబంధంగా డిజిటల్ లెర్నింగ్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రధానాచార్యులు ఆచార్య జాన్ మిల్టన్ ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జూన్ 18,19 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదవ సెమిస్టర్‌లో భాగంగా తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్లుగా డాక్టర్ బి.వి.రావు, డాక్టర్ ఎస్.శ్రీలత , శ్రీ రమేష్ వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీ శ్రద్ధా మేడమ్ విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై శిక్షణ అందిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య జాన్ మిల్టన్ మాట్లాడుతూ, ఈ తరగతుల ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకొని తమ జీవితంలో వినియోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఐక్యూఏసీ కోఆర్డినేటర్ హవిలా మేడమ్ , అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.









