తన సినిమా ఆలస్యం కావడంపై సాయి దుర్గా తేజ్ క్లారిటీ!

మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’ చుట్టూ గత కొన్ని రోజులుగా రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు కావడం, ఒక గ్లింప్స్ మినహా ఎలాంటి అధికారిక అప్‌డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా వాయిదా పడిందంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రాజెక్ట్ ఆలస్యం కావడంపై వస్తున్న వార్తలకు సాయి దుర్గా తేజ్ తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొని పూర్తి క్లారిటీ ఇచ్చారు.

రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా.. 1980ల నాటి రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో, అణచివేతకు గురయ్యే గిరిజనుల కోసం ఎదురుతిరిగే ‘బాలి’ అనే పవర్‌ఫుల్ గిరిజన నాయకుడి కథాంశంతో రూపుదిద్దుకుంటోంది.

సినిమా ఆలస్యంపై తేజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్నమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను విరివిగా చూస్తున్నారని గుర్తుచేశారు. రకరకాల జానర్లలో వస్తున్న సరికొత్త కంటెంట్‌ను ఫాలో అవ్వడం వల్ల, ఆడియన్స్‌కు సినిమా మేకింగ్, కథలపై నాలెడ్జ్ మరియు ఆలోచనా విధానం ఎంతో పెరిగాయన్నారు. అందుకే పాతకాలపు రొటీన్ కథలను జనాలు అస్సలు ఆదరించడం లేదని, కేవలం సినిమాలు చేయాలనే తొందరతో కాకుండా, ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొంచెం లేట్ అయినా సరే.. పక్కా కంటెంట్‌తోనే వస్తానని తేజ్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు