భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కె విద్యాసాగర్ అంతిమయాత్ర…
భద్రాచలం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదికి ఘనంగా వీడ్కోలు పలికిన న్యాయవాదులు..
భద్రాచలం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది కీర్తిశేషులు కె. విద్యాసాగర్ అంతిమయాత్రను కుటుంబ సభ్యులు మిత్రులు భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల అంతిమయాత్ర అత్యంత ఘనంగా నిర్వహించారు. భద్రాచలం పట్టణ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు కుటుంబ సభ్యులు మిత్రులు పాల్గొని తమ సహచర సీనియర్ న్యాయవాదికి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు.
అనంతరం జరిగిన అంతిమయాత్రలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సున్నం రమేష్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, కోశాధికారి దన్నాన రాము, కల్చరల్ సెక్రటరీ కొత్త మల్లేష్, సీనియర్ న్యాయవాదులు ఎం.వి. రమణారావు, మాజీ అధ్యక్షులు కోట దేవదానం,నండూరి శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది పి.వి. కృష్ణమాచారి, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యులు మందడపు శ్రీనివాసరావు, మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లు సత్యనారాయణ, హైకోర్టు ఏజీపీ సాల్మన్ రాజు, ఖమ్మం న్యాయవాది సత్య ప్రసాద్ కే. శ్రీమన్నారాయణ,రావి రామ్మోహన్, ఎస్.కె అత్తర్, పసుపులేటి రాంబాబు, వర్షిక సోమరాజు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు జలసూత్రం శివరామకృష్ణ, భద్రాచలం సీనియర్ న్యాయవాదులు , టీ చైతన్య, చుక్క నాగ అంబేద్కర్, పేరాల నాగరాజు, బండారు అరుణ్ చంద్, పామరాజు తిరుమలరావు, పడిసిరి శ్రీనివాసరావు, అవులూరి సత్యనారాయణ, వైద్యుల వెంకటేశ్వర్లు,పి. రవివర్మ, సాధన పల్లి సతీష్, సోముల గిరిప్రసాద్, చిరంజీవి, గౌతమ్, దండమూడి శ్రీనివాస్, పల్లంటి ప్రవీణ్ కుమార్, బి.వి.కార్తీక్, వలవల సురేష్ కుమార్, కొత్తపల్లి రాంబాబు, ఊకే రవి, పూనెం మధు, కొరసా నరేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు









