సర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి

మణుగూరు:14 జూలై :Toda9News ప్రతినిధి,D Ramesh, మణుగూరు

భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పారదర్శకత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియ ఓటర్ల నమోదు గడువు దగ్గర పడుతున్నందున సంబంధిత బి ఎల్ వో లు, సూపర్వైజర్లు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని 110-( ఎస్ టి) పినపాక నియోజకవర్గం ఈ ఆర్ ఓ మరియు ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఓటర్లకు సూచించారు.

మంగళవారం నాడు మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా మండలాల వారీగా ఓటరు నమోదు తీరును పరిశీలించి సంబంధిత రెవెన్యూ సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ అంటే కేవలం ఓటర్ల జాబితా సవరణ మాత్రమే అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడానికి మరియు జాబితాలోని తప్పులను సరిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం అని, బిఎల్వోలు, సూపర్వైజర్లు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందించేటప్పుడు వారికి అవగాహన కల్పించాలని, సంబంధిత ఓటర్లు కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరి పూర్తిస్థాయి వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేయించి తిరిగి బిఎల్ఓలకి అందించినప్పుడు తప్పనిసరిగా ఓటర్లకు రసీదు ఇవ్వాలని అన్నారు.సంబంధిత ఓటర్లు సర్ ఓటర్ జాబిత ప్రక్రియలో ఓటు నమోదు చేయించుకోవడానికి ఎటువంటి అనుమానాలు, భయాందోళనలు పెట్టుకోవద్దని, ఈ సర్వే ద్వారా మరణించిన వారి పేర్లు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించడం కోసమేనని, ఇది కేవలం ఓట్ల సవరణ ప్రక్రియ మాత్రమేనని, అర్హులైన వారి ఓట్లను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించబోరని ఓటర్లకు సంబంధింత బిఎల్వోలు తెలియజేయాలన్నారు.

అనంతరం ఓటర్ నమోదు ప్రక్రియ తక్కువ జరిగిన మండలాల తాసిల్దారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ ఈనెల 24 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యేలా బి ఎల్ ఓ మరియు సూపర్వైజర్లు ఇంటింటి సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ అద్దంకి నరేష్ ,ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ శ్రీమతి అనూష, ఆర్ ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు