సౌదీ అరేబియాకు బంగారంతో వెళ్తున్నారా? కొత్త నిబంధనలు ఇవిగో, తస్మాత్ జాగ్రత్త!

సౌదీ అరేబియాకు ప్రయాణించే ప్రయాణికులకు అధికారులు బంగారం రవాణాపై కీలక నిబంధనలు తీసుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చే లేదా వెళ్లే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ కొత్త రూల్స్‌ను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

తాజా మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణికులు నిర్దేశిత పరిమితికి మించి బంగారాన్ని తీసుకెళ్లాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత వినియోగం పేరుతో పరిమితికి మించి బంగారం తరలించి, అధికారులకు సమాచారం ఇవ్వకపోతే అక్రమ రవాణా కింద పరిగణిస్తారు. ముఖ్యంగా విలువైన లోహాలు, ఆభరణాలు లేదా భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు కస్టమ్స్ అధికారులకు ముందుగానే వివరాలు సమర్పించాలి.

ఈ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే బంగారం సీజ్ చేయడంతో పాటు కఠినమైన జరిమానాలు విధిస్తారు. కాబట్టి సౌదీ బాట పట్టే ప్రయాణికులు తాజా మార్గదర్శకాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రయాణం ప్రారంభించే ముందే సంబంధిత కస్టమ్స్ నిబంధనలను సరిచూసుకొని, అనవసరమైన చిక్కుల నుంచి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు