విలైనాంత త్వరగా గిరిజన ప్రజల సమస్యలు పరిష్కరించాలి:ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్.

 

భద్రాచలం జూన్ 29
టుడే 9 ప్రతినిధి

వర్షాలు పడుతున్న ఎంతో నమ్మకముతో గిరిజన దర్బార్లో వారి సమస్యల పరిష్కారం కోసం వస్తున్న ఆదివాసి గిరిజన కుటుంబాల సమస్యలు పరిష్కరించడంతో పాటు అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ సదూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుండి ఆయన యూనిట్ అధికారుల సమక్షంలో అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ వీలైనంత తొందరగా అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈరోజు గిరిజనులు గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలలో గురుకులం పాఠశాల మరియు ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలల్లో సీట్లు ఇప్పించుట కొరకు, పొడు భూముల పట్టాల కొరకు, పట్టాలలో పేర్లు మార్పు కొరకు, రైతుబంధు రుణాల కొరకు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు మరియు పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం కొరకు, గిరిజన గ్రామాలలో వ్యవసాయం చేసుకోవడానికి కరెంటు, బోరు, మోటారు కొరకు మరియు మారుమూల గిరిజన గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించుట కొరకు, నూతనంగా మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసుకొనుట కొరకు, దీర్ఘకాలిక జబ్బులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి వృత్తి శిక్షణలు ఇప్పించుట కొరకు, తమ పంట పొలాలలో బోర్లు వేయించుకోవడానికి అనుమతి కొరకు, సౌర గిరి విద్యుత్ కలెక్షన్లు ఇప్పించుట కొరకు, ఇసుక సొసైటీల సమస్యలు పరిష్కరించుట కొరకు. ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించుట కొరకు గిరిజనులు అర్జీలు సమర్పించారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఆర్సిఓ గురుకులం అరుణకుమారి డిడి ట్రైబల్ వెల్ఫేర్ చందన ఎస్ డి సి ఆనంద్ కుమార్ ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్ ఎడిఎంహెచ్వో సైదులు ఏవో సున్నం రాంబాబు,ఏడి అగ్రికల్చర్, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీఓ పవర్ వేణు, ఎస్ డి సి మనిధర్, పీవీటీజీ అధికారి గన్యా, హౌసింగ్ ఏఈ హేమంత్, మిషన్ భగీరథ ఏ ఈ ఈ నారాయణ రావు,మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది స్వాతి, లింగా నాయక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు