విజయ్ దేవరకొండపై నిర్మాత అభిషేక్ నామ సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ హీరో విజయ్ దేవరకొండపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా మారి రూపొందించిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ నామ పాత వివాదాన్ని గుర్తుచేసుకున్నారు.

 

గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకు అభిషేక్ నామ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తమకు భారీ నష్టాలు వచ్చాయని ఆయన ఈ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పారు.

 

“ఆ సినిమా వల్ల మాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినప్పటికీ… మేము విజయ్ దేవరకొండను ఒక్క రూపాయి కూడా తిరిగి అడగలేదు. కానీ, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మా బ్యానర్‌లో ఆయన మరో సినిమా చేస్తారని ఆశించాం. దానికోసం ఏకంగా మూడేళ్ల పాటు ఎదురుచూశాం. అయినా సరే ఆయన నుండి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు” అంటూ అభిషేక్ నామ తన ఆవేదనను పంచుకున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్. రామారావు నిర్మించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు