సింగరేణి కార్మికులకు తీరని గ్యాస్ కష్టాలు….
D రమేష్, Today9News ప్రతినిధి, మణుగూరు
మణుగూరు సింగరేణి కార్మికులు గ్యాస్ కష్టాలతో సతమతమవుతున్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఎదురుచూపులు తప్పడం లేదు. గ్యాస్ సరఫరా చేయటంలో డీలర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరో ప్రత్యామ్నాయం లేక గ్యాస్ కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన అగత్యం ఏర్పడదని వాపోతున్నారు
మణుగూరు సింగరేణి ఏరియాలో సింగరేణి కార్మికులకు గ్యాస్ కష్టాలు.ఎదుర్కొంటున్నారు. అభిరామ్ గ్యాస్ డీలర్లకు సింగరేణి గ్యాస్ కనెక్షన్లు అప్పగించారు.. గ్యాస్ సరఫరా చేయడంలో డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సింగరేణి కార్మికులు క్యూ కట్టి నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి… ఇకనైనా అధికారులు స్పందించి సకాలంలో గ్యాస్ సరఫరా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు.









