ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చందా లింగయ్యకు గౌరవ డాక్టరేట్.
D రమేష్, Today 9News ప్రతినిధి, మణుగూరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లా పరిషత్తు చైర్మన్ గా పనిచేసిన చందా లింగయ్య దొరకు గౌరవ డాక్టరేట్ లభించింది. సామాజిక సేవ న్యాయకత్వ రంగంలో ఆయన విశిష్ట సేవలు అందించేందుకుగాను ఈ పురస్కారం ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ప్రజా సమస్యల పట్ల స్పందించి నిరంతరం పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరువరానిది. నిస్వార్థం నిబద్ధత ప్రదర్శించిన చందా లింగయ్యకు ఈ పురస్కారం లభించటంతో ఆయన స్వగ్రామమైన ప్రస్తుత పినపాక నియోజకవర్గం కరక గూడెం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక సేవ, నాయకత్వ రంగంలో, విశిష్ట సేవలకు, అంతర్జాతీయ గుర్తింపు ఇస్తూ ఆదివాస హక్కుల ఉద్యమ నాయకుడైన చందా లింగయ్య దొరకు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్స్ లెన్స్ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.









