డీజీపీ సివి ఆనంద్ చేతులమీదగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మణుగూరు పోలీస్ స్టేషన్.
D రమేష్, Today 9 news ప్రతినిధి, మణుగూరు
మణుగూరు పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు పూర్తయ్యాయి . అన్ని హంగులతో సిద్ధం చేసిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, సిఐ నాగబాబు, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై రవుఫ్ లు మణుగూరు విచ్చేయనున్న డీజీపీ సివి ఆనంద్ కు ఘన స్వాగతం పలకనున్నారు. రాష్ట్ర పోలీస్ బాస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి మణుగూరు పోలీస్ స్టేషన్ సిద్ధం అయింది. ప్రారంభోత్సవం అనంతరం ఈ పోలీస్ స్టేషన్ భవనం అందుబాటులోకి రానున్నది ఇది ఇలా ఉంటే డీజీపీ పర్యటన సందర్భంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.










