హైదరాబాద్‌ ఇండస్ట్రియల్ కారిడార్: తుక్కుగూడ వద్ద రూపుదిద్దుకుంటున్న కొత్త ఎకనామిక్ హబ్

హైదరాబాద్ శివారు ప్రాంతం అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా వేగంగా రూపాంతరం చెందుతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని తుక్కుగూడ వద్ద ‘హైదరాబాద్ కొత్త ఎకనామిక్ కారిడార్’ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీకి అత్యంత చేరువలో ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన సానుకూల అంశంగా మారింది. హార్డ్‌వేర్ పార్క్-3 పరిధిలో జరుగుతున్న ఈ పారిశ్రామికాభివృద్ధి పనుల వల్ల నగర శివార్ల ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది.

ఈ కారిడార్‌లో పరిశ్రమల స్థాపనకు ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఎనిమిది దిగ్గజ సంస్థలు ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పేందుకు ఏకంగా రూ. 5,723 కోట్ల భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా సుమారు 8,890 మంది నిరుద్యోగులకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఐటీ (IT), ఏరోస్పేస్, రక్షణ రంగం మరియు హెవీ ఇంజినీరింగ్ రంగాలకు ఈ కొత్త కారిడార్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మెరుగైన రవాణా సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (TGIIC) అధికారుల ఆధ్వర్యంలో తుక్కుగూడ, మహేశ్వరం పరిసర ప్రాంతాల్లో భారీ ల్యాండ్ బ్యాంకులను పారిశ్రామిక అవసరాల కోసం సిద్ధం చేశారు. విమానాశ్రయ కనెక్టివిటీతో పాటు శ్రీశైలం హైవే రవాణా అనుకూలత వల్ల అమెజాన్ వంటి గ్లోబల్ డిగ్గజాలు ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుండగా, తయారీ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయి. బహుళజాతి సంస్థల ప్రతినిధులు పెట్టుబడుల నిమిత్తం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుండటంతో, రాబోయే రోజుల్లో ఆతిథ్య, ఇంజినీరింగ్ రంగాల్లో మరిన్ని భారీ పరిశ్రమలు ఇక్కడ తమ విభాగాలను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు