50 ఏళ్ల నిరీక్షణకు తెర: మణుగూరుకు కొత్త శోభను తెచ్చిన నూతన పోలీస్ స్టేషన్…

  • 50 ఏళ్ల నిరీక్షణకు తెర: మణుగూరుకు కొత్త శోభను తెచ్చిన నూతన పోలీస్ స్టేషన్
  • ఆధునిక సాంకేతికతతో సింగరేణి క్షేత్రంలోనే మొదటి ఖరీదైన పోలీస్ స్టేషన్

Today9News ప్రతినిధి, రమేష్, మణుగూరు

సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరు పట్టణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సుమారు 50 సంవత్సరాల తర్వాత పట్టణ విస్తరణకు అనుగుణంగా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంభం కావడం స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి .

ఆధునికతకు ప్రతీక…

నూతన పోలీస్ స్టేషన్ పట్టణానికి కొత్త శోభను చేకూరుస్తోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థతో ఈ స్టేషన్ నిర్మితమైంది. పరిసర ప్రాంతాలన్నీ నిఘా నీడలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. సింగరేణి క్షేత్రస్థాయిలోనే అత్యంత ఆధునిక సదుపాయాలతో, అత్యధిక వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ ఇదేనని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ శాఖ పనితీరు, స్టేషన్ హంగు ఆర్భాటాలను చూసి పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాటాకు గుడిసె నుండి సర్వాంగ సుందరంగా..

మణుగూరు తొలినాళ్లలో తాటాకుల గుడిసెలతో, సింగరేణి డబుల్ బ్యారేజ్ ఇండ్లతో మొదలైంది. క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు జిల్లాలోనే ఆదర్శ పట్టణంగా మారింది. ఈ అభివృద్ధికి తగ్గట్టుగా నూతన పోలీస్ స్టేషన్ కూడా శాంతి భద్రతలకు నిలయంగా నిలిచింది.

కర్తవ్యంలో ఆదర్శం..

ఇటీవల కోట్లాది రూపాయల విలువైన గంజాయిని పట్టుకుని వందలాది ప్రాణాలను కాపాడిన ఘటనతో మణుగూరు పోలీస్ శాఖ తమ కర్తవ్య నిబద్ధతను చాటింది. ఈ సాహస చర్య జిల్లాకే ఆదర్శంగా నిలిచింది.
ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్న మణుగూరు పోలీస్ శాఖకు, నూతన స్టేషన్ రావడంతో మరింత బలం చేకూరినట్లైంది.

 

 

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు