Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన బట్ట శ్రీను ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో , అన్నదమ్ములకి ఇద్దరికీ ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. శ్రీను మరణానికి ముందే ఆయన సోదరుడు కూడా మరణించగా, చిన్నతనంలోనే తండ్రులని కోల్పోవడంతో కుటుంబం వరుస విషాదాలను చవిచూసింది.
ఈ కుటుంబం దయనీయ పరిస్థితిని తెలుసుకున్న నైనిష ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే శ్రీను మరియు వారి తమ్ముడి కుమార్తెలు ముగ్గురి విద్యాభారాన్ని నైనిష ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ సంస్థ అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ మట్టపల్లి సాగర్ యాదవ్, జర్నలిస్ట్ పోదిల వీరబాబు, అడ్వకేట్ ఈర్ల రాము, జర్నలిస్ట్ మిట్టపల్లి గోపి, తదితరులు పాల్గొన్నారు..









