ఐటిడిఏ ఆఫీసు ఆదివాసుల కోసమా…గిరిజనేతరులకు కొమ్ముగాయడానికా ప్రశ్నించిన న్యూ డెమోక్రసీ నేత ముసలి సతీష్..

ఐటిడిఏ ఆఫీసు ఆదివాసుల కోసమా? ఫారెస్ట్ అధికారులకా.. గిరిజనేతరులకు కొమ్ముగాయడానికా ప్రశ్నించిన న్యూ డెమోక్రసీ నేత ముసలి సతీష్..

రేపు చలో PO ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయండి అంటూ పిలుపు…

భద్రాచలం : జులై :12: D వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి..

భద్రాచలం ఐటిడిఏ ఆఫీసు ఉన్నది గిరిజన ఆదివాసీల కోసమా? లేక ఫారెస్ట్ అధికారుల కోసమా? లేక గిరిజనేతరుల కోసమా? అనేది అర్థం కావడం లేదని  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ సందేహం వ్యక్తం చేశారు.

తాత ముత్తాతల నుండి గడ్డోరీగట్టు గిరిజన ఆదివాసీ ప్రజలు పోడుభూమి కొట్టుకొని అడవిలోనే జీవిస్తున్నామని దాన్ని గుర్తించిన పాలకులు ప్రభుత్వాలు అధికారులు తమకు గ్రామ సభ తీర్మానం,పిసా యాక్ట్, 1/70 అటవీ హక్కుల చట్టం ప్రకారం అన్ని సర్వేలు నిర్వహించి ఆదివాసీలకు ఆర్ ఎఫ్ ఓ ఆర్ పట్టాలను ఇచ్చారన్నారు .ఇప్పుడు కొత్తగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్  మా పర్మిషన్ లేకుండా అటవీ హక్కుల చట్టాన్ని ఫిసా యాక్టిని ఉల్లంఘించి మా ప్రాంతంలోకి అడుగుపెట్టి మా అడవుల్లో ఉన్నటువంటి భూములను తిరిగి ఇవ్వాలని బెదిరిస్తూ అక్రమ కేసులు పెడతామని ఆదివాసీలను అమాయకులను బెదిరించి వేధింపులకు గురిచేస్తూ భూములను ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు .

 

ఐటిడిఏ అధికారులకు ఫారెస్ట్ వారికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదని . అసలు ఐటీడీఏ ఆఫీసు ఆదివాసీల కోసం ఉన్నదా లేకపోతే ఆదివాసులను ఇబ్బందులు పెడతానికి ఉన్నదా, లేకపోతే ఆదివాసీలను ఇంత ఇబ్బందులకు గురిచేస్తున్న సూసి సూడనట్టుగా కళ్ళు మూసుకొని ఉన్న ఐటీడీఏ తమకు  అవసరమా అనే ఆలోచన కూడా గిరిజనులకు వస్తుందన్నారు

 

ఐటిడిఏ అధికారులు ఆదివాసీల మీద దాడులను కావాలనే చేయిస్తున్నారని . సందేహం వ్యక్తం చేశారు   ఒకపక్క ఫారెస్ట్ వారు చట్టాలను ఉల్లంఘించి పోడు భూములను గుంజుకొని సర్వేలు చేయకుండా, ఇతర మొక్కలు సాగు చేయకుండా  జామాయిల్ మొక్కలు వేస్తూ  పరోక్షంగా  బిపిఎల్ కంపెనీకి తొత్తులుగా మారుతున్నారనే అనుమానం వ్యక్తం చేశారు  కాబట్టి తక్షణమే ఆదివాసుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ సంస్థ కళ్ళు తెరిచి ఆదివాసీలను కాపాడుకోవాలన్నారు

 

 

చట్టాల ఉల్లంఘన చేసి భూములను గుంజుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆదివాసీలతో పెద్ద ఎత్తున  ఆందోళనకు సిద్ధపడతామని తెలియజేశారు   ఇలా ఉంటే ఈ సమస్య మీద ఐటిడిఏ ముట్టడి ఉంటుందని అధికారులను ఎవరిని పోనివ్వకుండా గేటు దగ్గరే ఘోరావు చేస్తామని హెచ్చరించారు . ఈ సమస్య రేపు పరిష్కారం కాకపోతే ఐటీడీఏ నుండి మొదలుకొని హైదరాబాదులో చీఫ్ కన్వెన్షర్ ఆఫీసు వరకు ముట్టడి కార్యక్రమాలు చేస్తామని అవసరమైతే ఆదివాసీలు తిరుగుబాటు చేయవలసి వస్తుందని  అన్నారు.

 

 

అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవినే నమ్ముకొని బ్రతుకుతున్న ఆదివాసులైన తమపైనే ఫారెస్ట్ అధికారులు జులుం చూపిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు.ఈ సమస్య పరిష్కారానికి పిఓ తక్షణమే పూనుకొని ఆదివాసులకు న్యాయం చేయాలని ఆర్ ఎఫ్ ఓ ఆర్ పట్టాలు ఉన్న భూముల జోలికి పోకుండా అవి వారికి అప్పజెప్పాలని  సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ పార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు . ఈ కార్యక్రమంలో మట్ట నరసింహారావు కుంజ జోగారావు రామప్ప రమేష్ లక్ష్మి రాజేశ్వరి రాధ భీమయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ మండల నాయకులు కుంజ జోగారావు మట్ట నరసింహారావు సమ్మక్క లక్ష్మణరావు తిరుమలరావు రమేష్ రామక్క రవణక్క కమల అక్క సరోజిని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు