మణుగూరుకు చేరుకున్న కేంద్ర బొగ్గు గల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన బిజెపి శ్రేణులు…

 

మణుగూరుకు చేరుకున్న కేంద్ర బొగ్గు గల శాఖ మంత్రి కిషన్  రెడ్డికి ఘనస్వాగతం పలికిన బిజెపి శ్రేణులు…

మణుగూరు: జూలై 13: Today9News ప్రతినిధి: D Ramesh

కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి మణుగూరుకు చేరుకున్న సందర్భంగా బిజెపి శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి  పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు..

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా  కిషన్ రెడ్డి మణుగూరు పర్యటన సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు ఆయనను కలిశారు. తమ సమస్యల పట్ల స్పందించాలంటూ వినతి పత్రం అందజేశారు

భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో సోమవారం నాడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి . కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పలు సమస్యలపై వినతి పత్రం కేంద్ర మంత్రికి ఇచ్చారు . తుడుందేబ్బ ఆధ్వర్యంలో మెమోరొండాల అంశాలు…

1) సింగరేణి కంపెనీకి ఆదివాసులు ఏజెన్సీ ప్రాంతంలో భూమి ఇస్తున్నారని,కాగా వారికి పూర్తి న్యాయం జరగడం లేదని
సి ఎస్ ఆర్ నిధులు కలెక్టర్ అకౌంట్లో పడుతుండగా బయటి ప్రాంతానికి తరలిస్తున్నరని మంత్రులు ఇక్కడ స్థానిక ప్రజలకు మొండి చేయి చూపెడుతున్నారని .మంత్రి దృష్టికి తీసుకువచ్చారు …

ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన హిందీ మాట్లాడేవారు ,స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని, స్థానిక యువతకు అవకాశం ఇవ్వాలంటూ దరఖాస్తు సమర్పించారు.

ఇది ఇలా ఉంటే గోదారి పరివాహక ప్రాంతంలో ఇసుక ర్యాంపుల్లో రేసింగ్ కాంట్రాక్ట్ పొందిన గిరిజనేతరులైన రేసింగ్ కాంట్రాక్టర్లు ఎన్నో అక్రమాలు చేస్తూ ఫారెస్ట్ భూమి, రెవిన్యూ భూమి కబ్జా చేస్తూ స్థానిక ఆదివాసి సొసైటీలలో గొడవలు సృష్టిస్తున్నారని, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్న వనరులు దోచుకుపోతున్నారని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు .
అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పూర్తిగా హక్కులు గిరిజనుల కేటాయించాలని పెండింగ్ లో ఉన్న హక్కుపత్రాలను వెంటనేఇవ్వాలని, ఫారెస్ట్ అధికారులు ఆదివాసులపై దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారని, వాటిని ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విన్నవించింది.
.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు