బొగ్గును తీసుకొని విద్యుత్ కేంద్రాలు డబ్బులు చెల్లించలేదు… మంత్రి కిషన్ రెడ్డి.
Today9News ప్రతినిధి, D Ramesh, మణుగూరు
కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి మణుగూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల రక్తాన్ని చమటగా చేసి ఉత్పత్తి చేసిన బొగ్గుకు రాష్ట్ర ప్రభుత్వం 56,000 కోట్లు చెల్లించాల్సి ఉందని . రావలసిన బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థను దివాళి తీసే విధంగా తయారు చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి.. అందువల్ల సింగరేణిలో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది అని వివరించారు. అందుకు కారణం పది ఏళ్ల పాలన చేసిన పాలకులదా,మూడేళ్లు పాలకులదా అనేది, కార్మికులు ఆలోచించాలన్నారు . మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2000 కోట్లు బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాడిచర్ల బ్లాక్ సింగరేణికి కేటాయించాలని దాదాపు 12 ఏళ్లకు ఆందోళన జరిగాయి. దానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో సింగరేణి మనుగడ కోసం సింగరేణి సంస్థకు అప్పగించారన్నారు.
కెసిఆర్ పాలనలో ప్రైవేటీకరించిన బొగ్గు బ్లాక్ కంపెనీలను రద్దు చేస్తే నాపై కంపెనీ యజమానులు కేసులు వేశారు… మంత్రి కిషన్ రెడ్డి..
కెసిఆర్ పాలనలో ప్రైవేటీకరించిన బొగ్గు బ్లాకు కంపెనీలను రద్దు చేస్తే నాపై కంపెనీ యజమానులు కేసులు వేశారని. కోర్టులో తేల్చుకుంటామన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సింగరేణి కాపాడుకోవాలన్నారు. సింగరేణి అస్తిత్వం దెబ్బతింటే సంఘాలు ఉండవు, రాజకీయ పార్టీలు ఉండవన్నారు కిషన్ రెడ్డి.
పీకే ఓ సీటు డిప్ సైడు బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలని మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు రామ్ గోపాల్….

మణుగూరు మనుగడ కోల్పోకుండా సింగరేణి పీకే ఓసి టు డిప్ సైడ్ బొగ్గు బ్లాకు సింగరేణికి కేటాయించాలని మంత్రి కిషన్ రెడ్డికి ఏఐటీయూసీ నాయకులు రామ్ గోపాల్.వినతిపత్రం అందజేశారు…
మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో కనీస వసతులు సౌకర్యాలు కల్పించలేదని సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు…

మణుగూరు పీకే ఓసి టు గనిలో పర్యటించిన మంత్రి కిషన్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ క్రమంలో బిజెపి నాయకులు అధికారులపై మండిపడ్డారు. కనీసం త్రాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ఎవరికి పెడతారు కాంగ్రెస్ వాళ్లక, కమ్యూనిస్టులు కా,.. ఎవరికి పెడతారు అంటూ బిజెపి నాయకులు ప్రశ్నించారు.. మీరు సేవ చేసిన బిఆర్ఎస్ పార్టీ పోయింది.. ఇక ఇది కూడా పోతుంది అంటూ బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.









