పకృతి తల్లి ఒడిలో మణుగూరు.. రథం గుట్టపై ఆకాశ గంగను తలపించే జలదృశ్యం

 

Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం: వర్షం పడిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పకృతి అందాలకు నిలయంగా మారుతుంది. ముఖ్యంగా మణుగూరు రథం గుట్ట పై నుంచి జారుతున్న జలదృశ్యం చూపరుల మనసులను దోచుకుంటోంది.

కొండ కోనల నడుమ సెలయేరులా పారే ఈ జలపాతం ఏకంగా ఆకాశ గంగను తలపిస్తోంది. కారుతున్న నీటి సవ్వడి, చుట్టూ ఆకుపచ్చని అడవులు.. ఈ దృశ్యం చూడటానికి రెండు కళ్లు చాలవు. వర్షాకాలంలో మాత్రమే కనిపించే ఈ అరుదైన అందం మరో ఓటి, మరో బృందావనం లా మైమరిపిస్తోంది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న విహారయాత్రలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి, ఏటూరు నాగారం వరకు వేలాది మంది పకృతి ప్రేమికులు రథం గుట్ట జలదృశ్యాలను చూసేందుకు ప్రతి ఏటా విహారయాత్రగా వస్తున్నారు. అడవి తల్లి బిడ్డల అమాయకపు ఆనందం, పకృతి ఒడిలోని ప్రశాంత పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

సింగరేణి తల్లి ఒడిలో నల్ల బంగారం
మణుగూరు అంటే కేవలం పకృతి అందాలే కాదు.. సింగరేణి తల్లి ఒడిలో వెలసిన పారిశ్రామిక పట్టణం. వందలాది అడుగుల లోతుల్లోని నల్ల బంగారం దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తోంది.

ఐదు దశాబ్దాలకు పైగా మనుగడ సాగిస్తున్న మణుగూరు సింగరేణి, నేడు దేశ విదేశాల్లో “సిరులవేణి” గా పేరు తెచ్చుకుంది. మరో ఐదు దశాబ్దాల పాటు నల్ల బంగారాన్ని అందించేందుకు సింగరేణి సిద్ధంగా ఉంది.

పకృతి అందాలు, పరిశ్రమలతో కలిసిన మణుగూరు భవిష్యత్తుకు మరో పునాదిగా, పోటీ తత్వంతో ముందుకు సాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు