“అల్లా నన్ను ఆదేశించాడు”: పారిస్‌లో ముగ్గురు మహిళలపై కత్తి దాడి.. ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకున్న పౌరులు!

పారిస్ వీధుల్లో కత్తులతో విచక్షణా రహిత దాడి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని పోర్ట్ డి క్లిచీ పరిసర ప్రాంతంలో అత్యంత భయాందోళనకరమైన ఘటన చోటుచేసుకుంది. రెండు పెద్ద వంటగది కత్తులు పట్టుకుని వీధుల్లో పరుగెడుతూ ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు మహిళలపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటనలో 19, 24, 36 సంవత్సరాల వయసున్న ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత మహిళల్లో ఒకరు గర్భవతి అని, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఫ్రెంచ్ మీడియా కథనాలు స్పష్టం చేశాయి.

ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకున్న సాధారణ పౌరులు కత్తి దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న సాధారణ పౌరులు అత్యంత సాహసంతో వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. మహమ్మద్ అలీ బౌహద్జార్ అనే 26 ఏళ్ల యువకుడితో పాటు మరికొందరు బాటసారులు నిందితుడిపైకి సూట్‌కేస్‌ను విసిరికొట్టడంతో అతడి చేతిలోని కత్తులు కింద పడిపోయాయి. ఆ వెంటనే వారు నిందితుడిని కింద పడేసి కదలకుండా పట్టుకున్నారు. అదే సమయంలో విధులు ముగించుకుని ఆ దారిలో వెళ్తున్న ఓ ఆఫ్ డ్యూటీ పోలీస్ అధికారి వెంటనే స్పందించి నిందితుడిని తన అదుపులోకి తీసుకోగా, ఆయన చూపిన ధైర్యసాహసాలను ఇంటీరియర్ మినిస్టర్ లారెంట్ నునేజ్ అభినందించారు.

“నన్ను అల్లాయే ఆదేశించాడు” అంటూ నిందితుడి అరుపులు పౌరులు నిందితుడిని కింద పడేసి పట్టుకున్న సమయంలో.. “నన్ను అల్లాయే ఆదేశించాడు” అని అతడు నిరంతరం బిగ్గరగా అరుస్తున్న మాటలు స్నాప్‌చాట్ వీడియోలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. అరెస్టు సమయంలో నిందితుడు చేసిన వ్యాఖ్యలు అసందర్భంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, అతడి అసలు గుర్తింపును ఇంకా పూర్తిగా ధృవీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘాతుకానికి గల అసలు కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, ఈ ఘటనపై ఉగ్రవాద కోణంలో విచారణ జరపాలా వద్దా అనే అంశంపై ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద నిరోధక ప్రాసిక్యూటర్ కార్యాలయం సమీక్షిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు