ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం.. ఏసీపీ

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం.. ఏసీపీ

ఆగష్టు 09…:

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం లోని నరసింహుగూడెం గ్రామం నందు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గ్రామపంచాయతీ ఆఫీస్ నందు ప్రారంభించారు.ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు కు తోడ్పాటు చేసిన గ్రామ సర్పంచ్కి మరియు గ్రామ పెద్దలు, ఉద్యోగస్తులు, మరియు గ్రామ పాలక మండలికి ప్రత్యేకంగా ఏసిపి శాలువాలతో సత్కరించిన్నారు. ఏసిపి మాట్లాడుతూ ..ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు.కూసుమంచి మండలంలో ఉన్న ప్రతి గ్రామ సర్పంచ్ లు నరసింహులగూడెం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసిపి సూచించారు.ఈ కార్యక్రమంలో ఏసీపితో పాటు కూసుమంచి సిఐ సంజీవ్, ఎస్ఐ నాగరాజు, మరియు నరసింహల గూడెం సర్పంచు మరియు ఉద్యోగస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు