గుండాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం…

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం…

ఆగస్టు 9..

గుండాల మండలం కాంచనపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఆదివాసి పాటలతో బ్యాండ్ డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి సంఘం నాయకులు పూనెం సుధీర్ అధ్యక్షతన గ్రామ దొర కొమరం రవి పటేల్ పూనెం వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆదివాసి ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జిల్లా నాయకులు పూనెం రంగన్న మాట్లాడుతూ.ఆదివాసీల
హక్కులను పాలకులు కాలరాస్తున్నారని, కుట్రపూరితంగా చట్టాలను నిర్విర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,

ఇది ఇలా ఉంటే1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని,
భూమి భుక్తి కోసం అనేక మంది ఆదివాసీలు అమరులయ్యారని ఆదివాసీ సంఘం నాయకులు గుర్తు చేశారు ప్రమాదం అంచున ఉన్న ఆదివాసీల ఉనికిని భవిష్యత్తు తరాలకు అందించటానికి,గిరి పుత్రుల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఆదివాసి చేయి చేయి కలిపి
ఆదివాసి ఉద్యమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు,

గిరిజనులకు విద్య, వైద్యం సంపూర్ణంగా అందించటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు . ఆదివాసి చట్టాలు కేవలం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవడానికే కాకుండా ఆదివాసి చట్టాలను ప్రతి ఒక్కరికి ఉపయోగ పడేలా చేయాలని అన్నారు

 

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్ కుమార్ ఆదివాసి నాయకులు పోలబోయిన వెంకట్ నర్సు పరిషిక చంద్రయ్య పూణెం లక్ష్మీనారాయణ తాటి రామనాథం కుంజ రమేష్ గో గేల చంద్రయ్య బోర్రకళ్యాణి పూణ్యం లక్ష్మి పూనం వెంకన్న పరిషక పుల్లయ్య మోకల భద్రం షాట్ల కిరణ్ కుంజ చిరంజీవి కోరంభద్రం అరెం వెంకటస్వామి బట్టు రమేష్ తదితర ఆదివాసి నాయకులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు