Tamil Nadu: తమిళ భాషపై మంత్రి వ్యాఖ్యలు.. బీజేపీ తీవ్ర విమర్శలు

తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీశాయి. అసెంబ్లీలో మాట్లాడుతూ.. తమిళ భాషను ఎంతగా అధ్యయనం చేసినా కొందరు అర్థం చేసుకోలేని విషయాలను క్రైస్తవ మతం తనకు నేర్పిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ తమిళ భాషను కించపరిచేలా మాట్లాడొద్దని హెచ్చరించింది. మరోవైపు, బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తమిళాన్ని సరిగ్గా మాట్లాడలేదని, వ్యాకరణపరమైన తప్పులు ఉన్నాయని ఎండీఎంకే ఎమ్మెల్యే టీఎం రాజేంద్రన్ విమర్శించారు.

క్రైస్తవ మతం తనకు ప్రేమ, శాంతి, కరుణ అనే విలువలను నేర్పిందని విల్సన్ పేర్కొన్నారు. తాను ఎంతగా తమిళాన్ని అధ్యయనం చేసినప్పటికీ కొందరు ఈ విలువలను అర్థం చేసుకోలేరని అన్నారు. తాను బైబిల్ చదివానని, పుట్టుకతోనే క్రైస్తవుడినని తెలిపారు. తమిళ భాషకు సంబంధించిన విమర్శల కంటే తమిళ పాలన, రాష్ట్ర అభివృద్ధిపైనే తనకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు.

తన మాట్లాడే శైలి, వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు ఎగతాళి చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. మరోవైపు, భవిష్యత్తులో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా తమిళంలో మాట్లాడాలని ఎండీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ సూచించారు. దీంతో మంత్రి వ్యాఖ్యలు, తమిళ భాషపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు