పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిపై అమెరికాకు “పూర్తి నియంత్రణ” ఉందని ట్రంప్ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై అమెరికా నౌకాదళం ఒత్తిడి కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌ను తాను ఎప్పటికీ నమ్మబోనని ట్రంప్ స్పష్టం చేశారు. టెహ్రాన్ అంతర్జాతీయ వ్యవహారాల్లో అబద్ధాలు చెబుతోందని ఆరోపిస్తూ.. ఆ దేశంపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. హోర్ముజ్ పరిణామాలు ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
ఇదిలా ఉండగా, టర్కీలో తన విమానాన్ని రహస్యంగా మార్చాల్సి వచ్చిన విషయాన్ని కూడా ట్రంప్ ధ్రువీకరించారు. ఇరాన్‌కు సంబంధించిన భద్రతా ముప్పు నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులు విమానం మార్చాలని సూచించడంతో తాను వారి ఆదేశాలను పాటించినట్లు తెలిపారు. గత నెల టర్కీ పర్యటనలో ట్రంప్‌ను మరో విమానంలో రహస్యంగా తరలించినట్లు వచ్చిన వార్తలను ఆయన స్వయంగా అంగీకరించారు.









