విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లిలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ రామ సుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లోని పరిశుభ్రత, వంటకాల నాణ్యత, ఆహార పదార్థాల రుచి, అందిస్తున్న ధరలను ఆయన స్వయంగా పరిశీలించారు.
తనిఖీలో భాగంగా కలెక్టర్ స్వయంగా టోకెన్ తీసుకుని క్యాంటీన్లో భోజనం చేశారు. అక్కడ అందిస్తున్న ఆహారాన్ని రుచి చూసి నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా క్యాంటీన్ నిర్వాహకులు నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు.
అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్య ప్రమాణాలు, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు నాణ్యమైన భోజనం అందించడం లక్ష్యంగా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగించాలని ఆదేశించారు.









