కోహ్లీ, రోహిత్‌లకు హర్భజన్ మద్దతు.. వయసు అడ్డంకి కాదంటూ కీలక వ్యాఖ్యలు

భారత క్రికెట్ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడాలనే పట్టుదలతో పాటు ఫిట్‌నెస్ ఉంటే వచ్చే వన్డే ప్రపంచకప్‌లోనూ ఈ ఇద్దరూ తప్పక ఆడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వయసు కంటే ఆటగాడి ప్రదర్శన, ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగనున్న తదుపరి వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్‌కు 40 ఏళ్లు, కోహ్లీకి 39 ఏళ్లు వస్తాయి. అయినప్పటికీ కోహ్లీ ప్రస్తుతం యువ ఆటగాళ్లతో సమానంగా, కొన్ని సందర్భాల్లో వారికంటే మెరుగైన ఫిట్‌నెస్‌ను ప్రదర్శిస్తున్నారని హర్భజన్ అన్నారు. అందువల్ల వయసును కారణంగా చూపి వారిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని సూచించారు.

ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని ఉదాహరణగా చూపిన హర్భజన్.. 39 ఏళ్ల వయసులోనూ ప్రపంచకప్ గెలిపించగలిగినప్పుడు, కోహ్లీ, రోహిత్ కూడా అలాంటి విజయాన్ని సాధించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఇద్దరి నైపుణ్యం, 300కుపైగా మ్యాచ్‌ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. యువ ఆటగాళ్లు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ, కీలక సమయాల్లో ఈ సీనియర్లు అందించే అనుభవంతో కూడిన స్థిరత్వాన్ని భర్తీ చేయడం కష్టమని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు