రెండో టెస్టుకు ముందు కుల్దీప్‌కు బహుతులే మద్దతు.. ప్లేస్‌పై క్లారిటీ!

శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే అండగా నిలిచారు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఒకే వికెట్ తీసుకోవడంతో అతడి స్థానంపై చర్చ మొదలైంది.

కుల్దీప్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను రెండో టెస్టులో అరంగేట్రం చేయించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శ్రీలంక జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు పెరగడంతో సారాంశ్‌కు అవకాశం లభించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే తుది నిర్ణయం పిచ్ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తీసుకుంటామని బహుతులే స్పష్టం చేశారు.

అయితే ఒక్క మ్యాచ్‌లో తక్కువ ప్రదర్శన చేసినంత మాత్రాన కుల్దీప్ ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బహుతులే పేర్కొన్నారు. గాలే టెస్టులో పరిస్థితులకు అనుగుణంగా కుల్దీప్ తన బౌలింగ్ విధానాన్ని మార్చుకుని, ఫ్లాటర్ ట్రాజెక్టరీతో బౌలింగ్ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ సూచించిందని తెలిపారు. దీంతో రెండో టెస్టులో కుల్దీప్‌కు అవకాశం ఉంటుందా? లేక సారాంశ్ జైన్ అరంగేట్రం చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share