పాకిస్థాన్‌కు భారీ ఊరట.. గడాఫీ స్టేడియం డీమెరిట్ పాయింట్ రద్దు

పాకిస్థాన్ క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి భారీ ఊరట లభించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పిచ్‌కు గతంలో విధించిన ఒక డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ రద్దు చేసింది. దీంతో గడాఫీ స్టేడియం ఖాతాలో ప్రస్తుతం డీమెరిట్ పాయింట్లు ఏవీ లేవు.

జూన్ 4న పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో గడాఫీ స్టేడియం పిచ్‌కు మ్యాచ్ రిఫరీ ‘అన్‌సాటిస్‌ఫ్యాక్టరీ’ రేటింగ్ ఇచ్చారు. ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ కింద ఈ రేటింగ్ ఆధారంగా స్టేడియానికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. పిచ్ చాలా నెమ్మదిగా, తక్కువగా బంతి రావడంతో బ్యాటింగ్‌కు ఇబ్బందిగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.

అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయంపై అప్పీల్ చేయడంతో ఐసీసీ ప్యానెల్ మ్యాచ్ ఫుటేజ్, మ్యాచ్ రిఫరీ నివేదిక, ఇరు జట్ల కెప్టెన్ల అభిప్రాయాలను పరిశీలించింది. పిచ్‌లో అసాధారణ స్థాయిలో బంతి ఎగరడం లేదా స్పిన్ కనిపించలేదని ప్యానెల్ తేల్చింది. దీంతో ‘అన్‌సాటిస్‌ఫ్యాక్టరీ’ రేటింగ్‌తో పాటు డీమెరిట్ పాయింట్‌ను కూడా రద్దు చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share