ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ భారత్‌లో తన కొత్త 5G ఫోన్ Infinix Hot 70 Pro 5Gను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి. కంపెనీ అధికారిక భారత వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో Infinix Hot 70 Pro 5Gను నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో తీసుకురానున్నారు. డైవ్ బ్లూ, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్, థెర్మో ఆరంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ప్రతి కలర్ వేరియంట్‌కు ప్రత్యేకమైన డిజైన్, ఫినిషింగ్‌ను కంపెనీ అందించింది.
థెర్మో ఆరంజ్ వేరియంట్ ఉష్ణోగ్రత మార్పులకు అనుగుణంగా రంగును మార్చుకునే ప్రత్యేక ఫీచర్‌తో వస్తుంది. మిరాజ్ గ్రీన్ వేరియంట్ తక్కువ వెలుతురులో తన రూపాన్ని మార్చుకునేలా రూపొందించారు. సిల్క్ గ్లో పర్పుల్ వేరియంట్‌లో షిఫ్టింగ్ టెక్స్చర్ ఉండగా.. డైవ్ బ్లూ వేరియంట్ మ్యాట్ ఫినిష్‌తో ఆకట్టుకోనుంది. దీంతో లాంచ్‌కు ముందే ఈ ఫోన్ డిజైన్‌పై ఆసక్తి నెలకొంది.









