గద్వాల మండలంలో అనుమానాస్పద మృతి.. వ్యక్తి మృతదేహం జిల్లా ఆసుపత్రికి తరలింపు

గద్వాల మండలం అనంతపురం గ్రామ శివారులో అశోక్ (45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన అశోక్ గత కొన్నేళ్లుగా అనంతపురంలో నివాసం ఉంటూ కొత్తగా నిర్మించే ఇళ్లకు అరలు నిర్మిస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

అశోక్ మృతదేహంపై గాయాలు ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన మృతికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికుల సమాచారంతో గద్వాల రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share